शरदऋतु की पंछीकी तरह,
प्रातःकाल की चाँदीकी तरह,
घायलीदिल की खामोषी है ये।
चुपतेकांटे के दामन है दिल,
पूछतेथके अनुत्तरित प्रश्न है कष्ट,
अप्रत्याशित जंगके मलवा है जीवन|
This is a blog to share/publish my write-ups!
शरदऋतु की पंछीकी तरह,
प्रातःकाल की चाँदीकी तरह,
घायलीदिल की खामोषी है ये।
चुपतेकांटे के दामन है दिल,
पूछतेथके अनुत्तरित प्रश्न है कष्ट,
अप्रत्याशित जंगके मलवा है जीवन|
ఘటికులకు సైతం లొంగని కరుడుగట్టిన ఆత్మబలం,
నిరాయుధుడైనా సిద్ధాంతబలంతో చేేయు విజయకదనం,
కలియుగంలో రాయు నవ త్రేతాశకం,
కార్యానుష్టంచ, ధర్మార్థకామమోక్ష జ్వలనం!
జీవితమెపుడూ కారాదు చిక్కుముడి,
కలలో కూడా పెట్టకు కంటతడి,
నీ ఆలోచనలేగా నీ పెట్టుబడి,
మనసును దారిలో పెట్టు కష్టపడి,
కష్టాలకు ఎదురీదు నిలబడి,
గెలుపే తానై చేరును నీఒడి,
కర్మేగా విజయానికి గుండెసవ్వడి!
నిరంతర కష్టతా సయోగ్యతం,
ఆత్మ పరిపూర్ణతా పరివేష్ఠితం,
అస్త్రశస్త్ర నిర్విఘ్నం,
శతృ దుర్భేద్యితం,
ప్రయత్నప్రయాసా నతస్కరం,
జ్ఞాన ఫలమనాద్యం, అనంతం!
English:
The qualification that resulted from endless study,
And by means of own honesty for merit,
Cannot be destroyed by weapons, tricks of power,
And cannot be stolen even by best trials.
Because the wisdom is eternal.
Karmani Samgam Thakya Karothiyaha,
Lipyathey Nasa Paapena Padma Pathrami!
कर्मानि संगम त्कया करोतियहा।
लिपयते नसा पापेना पद्म पथरमी।।
ఎవరైతే కర్మలపై భగవంతునితో సమానముగా ఆసక్తితో ఉంటారో,
వారికి తామరాకుపై నీటిబొట్టులా పాపాలు అంటవు.
Person, who treats karma/work as divine will never get marks of sins!
వద్దనుకునే వాళ్ళకి దూరంగా,
వదులుకునే వాళ్లకి సౌకర్యవంతంగా,
అభిమానించే వారికి అందుబాటులో ...
యోధానాం ఆయుధాన్ వికల్పాం,
కార్యోన్ముఖై ఆత్మత్యాగ పరాయణాం,
విజేతపర్వాం సకృతయే సత్ఫలాం భవతు!
అర్థం
పోరాడే తత్వమున్న వీరుడికి, ఆయుధాలెందులకు?
తలపెట్టు పనికై చేయదలచిన త్యాగము చాలదా?
సాధించిన పిమ్మటజేయు సత్కార్యములు చాలవా?
ఆకలితో ఉన్న జంతువు కూడా అత్యాశతో, స్వార్థంతో కూడిన మనిషికన్నా నయం.
ఆకలి తీరగానే వేరొక వేటకై చూడదు!
ప్రతీదానిలో స్వప్రయోజనం వెతెకేవాళ్ళు దేనికైనా తెగిస్తారు, దేన్నైనా పణంగా పెడతారు!
చివరికి పిడికెడు మట్టిని సైతం తీసుకెళ్ళలేమనే సత్యాన్ని గ్రహించరు!
తరతరాలు నిద్రించిన నిశ్శబ్దం
ముక్కలవుతున్న పెనుశబ్దం,
అలలెగసిన తడినిస్తేజం
అలజడవుతున్న ఉగ్రతేజం,
సత్యపరాయణ దీక్షం
చేయు నిత్యప్రణవనాదం,
స్త్రీపురుషులనే మూసవితండం
ప్రశ్నిస్తే ప్రబలు చైతన్యం!
నిజం నిప్పులాంటిది,
ముట్టుకుంటే కాలిపోద్ది (మనకి).
అబద్ధం అప్పడంలాంటిది,
పట్టుకుంటే పగిలిపోద్ది (నిజం తెలిస్తే)!
ఆనందం తెల్లకాగితం లాంటిది. కష్టాలనే ఒత్తులేకుండా రాయబోతే చిరిగిపోద్ది (క్షణికం)!
ప్రేమ పక్షిలాంటిది,
బంధించాలని చూస్తే ఎగిరిపోద్ది (ఇంకొకరితో).
ఆశ జిగురులాంటిది,
ఒకసారి పట్టుకుంటే, అతుక్కుపోద్ది (వదలదు)!
The only irreplaceable capital an organization possesses is the knowledge and ability of its people. The productivity of that capital depends on how effectively people share their competence with those who can use it!
Knowledge management fails when people need common information but don’t need each other!
One who thinks principles are fetters,
For that person, disobedience or defiance is natural outcome.
भविन् सिद्धान्त विचार श्रृंखलां,
अवज्ञा सुगम भवति|
Bhavin Siddhanth Vichaara Shrunkhalam,
Avajnya Sugam Bhavathi!
భవిన్ సిద్ధాంత విచార శ్రృంఖలం,
అవజ్ఞ సుగమం భవతీ|
ఎవరైతే నియమాలను సంకెళ్ళని పొరబడుదురో,
వారికి ధిక్కారం మరియు ఉల్లంఘన తప్పనిపించదు!
Do you know Marathi Names?
Most names end with 'kar' are Marathi and there are many proud Indians from Maharashtra, who influenced the world and most successful in their fields.
- B. R. Ambedkar
- Medha Patkar
- Lata Mangeshkar
- Nana Patekar
- Shilpa Shirodkar
- Urmila Matondkar
- Namrata Shirodkar
- Madhur Bhandarkar
- Sachin Tendulkar
- Sanjay Manjrekar
- Sunil Gavaskar
- Isha Koppikar
- Kimi Katkar
- S L Kirloskar
- Yashwanth Kanetkar
- Rahul Ramporkar
Break glass for humanity.
Stand for what you believe as right.
Protect what you like and love.
Use your energies for your goals than temporary needs.
Admire someone but you still do adorable deeds so that you are special too.
Empathy is not weakness,
Humanity is not disadvantage,
Honoring others' request won't set you back.
Expectation is not skill,
Betraying will not be at advantage,
Cheating is not wisdom.
Success is not a destiny,
Fate is not written,
Luck is not a factor,
Everything is made by you.
Live and let people live. No boy, no girl, no matter whoever! We are all humans.
నీ జడపాయల్లో ఊపిరి బిగిసినా,
నీ చూపుల్లో గుండె లయ తప్పినా,
నీ మౌనభావాల ఊహలు పురివిరిప్పినా,
నీ అనుమతి లేని ప్రపంచంలోకి నే అడుగిడెనా?
ఊహల్లే నీ రూపం,
ఏదో తెలియని ఆత్మబంధం,
నువు సంభాషించే తరుణం,
మది స్వాంతన పొందే తీరం,
నీ కలయికే నా స్వప్నం,
అది నిజమైనా - కాదులే నమ్మశక్యం!
ఎద చీల్చుతున్నా ఒంటరి తిమిరం,
ధైర్యం చెప్పేది నీపిలుపనే సంధ్యారాగం.
చెప్పలేని ఇష్టమే తలపై,
నిండిపోయె వలపే,
మూగభాష మనదే అంటూ,
మౌనరాగం పలికే,
మిన్నకున్న మనసే ఇపుడు,
అన్న మాట వినదే,
మౌనమింక వలదూ అంటూ,
మంతనాలు జరిపే,
నిన్న కన్న కలలే నేడు,
నిన్ను కోరి తలచే,
రెప్ప చాటు చూపే నేడు,
రెక్కలొచ్చి ఎగిసే.
నేను
వద్దనుకునే వాళ్ళకి దూరంగా,
వదులుకునే వాళ్లకి సౌకర్యవంతంగా,
అభిమానించే వారికి అందుబాటులో ...
నేను
నీ గమ్యం ఓ ఘటన,
నీ గమనం నీ చేవ్రాలు.
ఎదురున్న ఉదయాన్ని చూడలేక,
అర్థనిమిల సత్యాన్ని సంగ్రహించక,
పైవాడిపైన భారం మోపగ!
నీ తప్పులు సరిదిద్ద,
ఆ దైవమేం దిగి వచ్చునో?
బోధపడెన నీకు శోకజీవ!
కూరిమి కలిగిన ధరణి,
స్వార్ధం విసర్జించు విసర్పిణి,
సౌజన్యం విరాజిల్లు కల్యాణి,
కారుణ్యం కురిపించు తరుణి,
శుభ శకునమవగా ఈ సుభాషిణి,
మధురమవదా జీవితం, ఓ రమణి!
నీ గర్భమందు, నా పాదమర్ధనాన సోలిపోయిననూ,
తిరిగి నే వెన్నబాల నవ్వ మురిసి, పోటు మరచిన మాతృమూర్తీ,
ముసలివైయున్నా, అట్టి మూగప్రేమ
అవధాన వేళ, జీవన వికాసమ్మై విరాజిల్ల,
ఏమిచ్చి నే రుణవిముక్తుండ,
మదీ చరమాంక సేవజేయ ధన్యుడ దేదీప్యమా?
Meaning: Telugu
నేను నీ కడుపులో కాలితో తన్నిన నొప్పిని ఓర్చుకొని,
నా ఒక చిరునవ్వుతో అన్నీ మరచిన ఓ అమ్మా,
నీవు ముసలి దానివైనా,
వ్యక్తం చేయని నీ ప్రేమ,
జీవితంలో అందలాలు ఎక్కించగా,
ఏమిచ్చినీ రుణం తీర్చుకోగలను,
నీ సేవ చేయడం తప్ప?
Meaning: English
Oh mother,
You beared the ache of my foot twists while I was in your stomach,
And just like that forgot that pain as soon as you see my little first smile!
When you get old, but your untold love still keeps me on top of this world,
How can I show my gratitude other than serving you at your difficult times?
మగువా, మగువా, నీకేంకావాలో నీకైనా తెలుసా?
మగువా, మగువా, నీమనసుకి ప్రశాంతతే కరువా?
ఎడారిలో పరిగెడతావూ, ఎండమావే చూస్తావు.
నిజమైన బంధాల్నే, చులకన చేస్తావు.
మగువా, మగువా, నీ విజయంలో మగ పాత్రలు లేవా?
అయినా కానీ, మగవాళ్ళే నీ శత్రువులంటావా?
కలదా, కలదా, ప్రేమను మించిన ధనమే కలదా?
కలలో, ఇలలో, నీ కన్నీటిని తుడిచే అతడొకడేగా?
గుండెలోన చేరి గురుతులెన్నో చేసి,
ఊహలెన్నో రేపి జ్ఞాపకంగా మారి,
కన్నీటి పరదాలు కసితీరా నలిపి,
తెరచాటు చిరునవ్వు తనివితీరా చెరిపి,
ఎటు పోయావో నను ఎడారిలో వదిలేసి?
మెరుపై మెరిసే కలలు,
అలలే ఎగసే భావాలు,
మనసే తలచే సంకెళ్లు,
మిధ్యై అలసే తీరాలు,
ఎనలేని నిట్టూర్పుల తిమిరాలు,
మారేనా సంధ్యా అరుణాలు?
Maturity is when ...
You do not seek approvals from others for your own decisions.
Maturity is when ...
You have lot to say, but you choose to remain silent.
Maturity is when ...
You learn to "let-go", accept the situations and move-on.
Maturity is when ...
You learn not to react to the behaviours.
Maturity is when ...
You accept people for who they are.
Maturity is when ...
You prove to the world with results than words.
Maturity is when ...
You focus on positives in people.
Maturity is when ...
You stop comparing yourself with others.
Maturity is when ...
Somebody hurts you and you try to understand their situation instead of trying to hurt them back.
Maturity is when ...
You differentiate between "need" and "want", and let-go of your "wants".
Maturity is when ...
You understand the fact that whatever you do, you do for your own peace.
Maturity is when ...
You stop attaching happiness to the material things.
Maturity is when ...
You are able to walk-way from people & situations that threaten your peace of mind, self-respect, value, self-morals or self-worth.
रब तू अपना जलवा दिखादे,
नफ़रतोंको बदलादे,
इंन्सानोंको क़रीबतो रक्षवादे,
हमारी दुशमनोंके भी ख्वाब हकीक़त करादे,
रब तू अपना जलवा दिखादे !!
మది నిండా నీ తలపులే,
దారులన్నీ నిను చేరువరకేలే,
ఆశలన్నీ నిను కోరుటకేలే,
కలలన్నీ నిను చేరుటకేలే,
ఈ నా కవితలన్నీ నీకందు సందేశానికేలే!
* Source: Wikipedia
ప్రేమంటే ఏమిటి?
ప్రేమంటే అవధుల్లేని ఆనందం
దానిలోఉంది తీయని మకరందం
ప్రేమించే మనసు ఒక విహంగం
ప్రేమించని మనిషి ఒక వేదాంతం
అది సఫలమైతే పగలేవెన్నెల చందం
అదే విఫలమైతే బ్రతుకంతా విషాదం
ఈ ప్రేమ మహిమలు అనంతం
ప్రేమని ప్రేమించు ప్రేమకై
కోటలుదాటిన కోట్ల మాటలెందుకు?
చేతలుగా మారిన ఒక్కమాట చాలు
మైమరిపించే మురిపించే వరాలెందుకు
సాటి మనిషికిచ్చే గౌరవం చాలు
గుడిలో దేవునికి క్షీరాభిషేకాలెందుకు?
ఇతరుల బాధలకు కనుజారే ఒక్క కన్నీటిబొట్టు చాలు
స్వార్థచింతనతో చేరే ఆకాశ పుంతలెందుకు?
నిస్వార్థంగా సాధించే విశ్వమానవ కల్యాణమే మేలు!
నేను సైతం మానవాళి అభ్యున్నతికై సమిధనవుతాను
నా కన్నులు ఎదురు చూసాయి నీ రాకకై
నా పాదాలు నడిచాయి నినుచేరు దారికై
నా హృదయం స్పందించింది నీ ప్రేమకై
ఎంతకాలమైనా వేచియుంటాను నీ బదులుకై
నీ నవ్వులు విరబుసిన ఈ వెన్నెల
ప్రతి రాత్రీ కవ్విస్తుందే నన్నే ఇలా
నా ఎదలోతున దాగున్న ఈ తీయని కల
ఏనాటికైనా నీతో తెలిపేదెలా?
ప్రభాతవేళ నేలను తాకిన తొలి సూర్యకిరణం
జగతిని మేలుకొలిపే ఉదయ సుప్రభాతం
నాలో అలజడి రేపిన నీప్రేమే తొలి సంధ్యారాగం
నిను చేరుటకే నా ఈ అలుపెరుగని ప్రయాణం
నీ నిరీక్షణలో అనుక్షణం ...
నీతో ఎన్నో చెప్పాలని ఊహల్లో విహరించా
నీదరికే చేరాలని మనసంతా తపించా
నీ విరహాగ్ని వేడిలో ఎడారినై రగిలా
నీవులేని దేశంలో నిశీధినై మిగిలా
కొన్ని భావాలే మాటలవుతాయి
కొన్ని మాటలే కవితలవుతాయి
కొన్ని కవితలే పాటలవుతాయి
నువ్వుంటే జీవితమే తీయని పాట
నీతోడుంటే కష్టాలైనా పూలబాట
నీతలపులే నామదిలో ప్రతిపూట
నీ పరిచయం నాకొక ఆద్బుతం!
నీతో స్నేహం నా జీవితానికో వరం
నీతో పరిణయం నాలోని అందమైన స్వప్నం
మరి నాకలలన్నీనిజంచేస్తావా నేస్తం?
కరిమబ్బుల దాగున్న వెన్నెల జాడ లేక
విరహంతో వేసారిన కోయిలలా
నీ మనసున దాగున్న ప్రేమ కానరాక
వేచియున్నానీ పిలుపు కొసం మౌనంలా!
మీరంతా ఆశ్చర్యపోవచ్చు ... "కలలే అలలై" ఈ పేరేమిటి అని!
మన కలలకి ఆలోచనలకి దగ్గర సంబంధం వుంది. ఈ రెండింటికీ ఎల్లలు లేవు. వాటిలోంచే మన మనసులోని భావాలు రూపు దిద్దుకుంటాయి. అలాంటి భావాల రూపకల్పనే ఈ "కలలే అలలై".