Wednesday, November 5, 2008

ఏమని చెప్పను

ఏమని చెప్పను ప్రియతమా నా తీరని కల?

ప్రేమగా మారిన స్నేహానివనా?
స్నేహంగా మిగిలిన ప్రేమవనా?

కలలన్నీనిజాలై ఆశ్చర్యపరచాయనా?
సత్యాలన్నీ కల్లలై నిరాశపరచాయనా?

నా గుండెలోతుల్లో దాగున్న ఆనందానివనా?
నా గుండెకోస్తున్న బాధకి కారణానివనా?

 నీ ప్రేమలోని తీయనైన బాధని ఏమని చెప్పను ప్రియతమా?

तुम्हारे

तुम्हारे सहराके अलावा हमे और कोई शहर नही
तुम्हारे गम छोडके मुझे और कोई ज़हर नही
तेरेबिना हमे और कोई जीनेकी चाहत नही!

నువ్వు

నీ తలపులే నా దారులన్నీ నిండివున్నా నిను చేరు దారి ఏదో తెలియదు
ప్రతి కలలో నువ్వున్నా, నా కలల్ని నిజమెప్పుడు చేస్తావో చెప్పవు
జగాన్నిమరచి నీ ఊహల్లో నేనున్నా నీ మనసులో నా జాడలేదు
నువ్వేదూరమైన నాడు, నాకు జీవితం అంటూ ఏమీలేదు!

వేచియుంటా

నీవులేని జీవితంలో ఏదో తెలియని అసహనం,
నీదూరమే నను మధించే ఓ హాలాహలం,
నీ స్మృతులన్నీ నామదిలో సదా పదిలం,
నీ పిలుపుకై నే వేచియుంటా కలకాలం!

Tuesday, May 20, 2008

స్వదేశం

యుగాల మార్పులకి రాళ్ళు సాక్ష్యంలా
నా జీవితంలోని మార్పులకి నా కళ్ళే సాక్ష్యంగా
మళ్లీ క్రొత్తజీవితం మొదలయిందని స్వదేశం పిలుస్తోంది

ఒకప్పటి నాకల నిజమై నిలిచినా ఇలా
దేశంకాని దేశంలో సాధించిందేమిటో కోల్పోయినదేమితో అర్ధంకాక
ఒంటరినై పయనిస్తున్నా మాతృభూమికి తరలివస్తున్నా

Thursday, May 15, 2008

तेरे नाम

जिसे हमेशा सोचा हम जाने जिगर
वोथी मेरे सपनो की हमसफ़र
ना मेरा कोई दोष ना मेरे कसूर
वो मुझे छोडके चलेगई बहूत दूर
अब उसे भूल के न सोयेगी नज़र
हम जीते है सिर्फ़ तेरे नाम लेकर

 

మనిషి

ఒక వైపు ఆగ్రహించిన ప్రకృతి, మరొకవైపు వికటించిన తీవ్రవాదం, ఈ రెండు మానవ జాతి మనుగడకి ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రకృతిని అడ్డుకునే శక్తి మానవునికి లేకపోయినా తనను తాను నాశనం చేసుకునే పధాన్నిమాత్రం మనిషి వీడాలి. కేవలం ఒక్క 20వ శతాబ్దంలోనే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 16.4 కోట్ల* మంది మానవులు యుద్ధాలవల్ల మరణించారు. ఈ సంఖ్య గత పంతొమ్మిది శతాబ్దాలలో మరణించినవారి సంఖ్యలో ఇంచుమించు మూడు వంతులు. దీనినిబట్టి పరిస్థితి ఎంత తీవ్రరూపం దాల్చిందో అర్ధం చేసుకోవచ్చు.

మనం ఇవాళ ఇలా సుఖంగా ఉండగలగడానికి, ఇంత సాంకేతిక అభ్యున్నతి సాధించడానికి మన పూర్వీకులు భవిష్య మానవులకోసం చేసిన నిస్వార్ధమైన శ్రమ, వారికి మనిషి మనుగడపైగల భాద్యత కారణాలు. నేటి తరం మనుషులకి అటువంటి సామాజిక భాద్యత, భవిష్యత్తు మానవుల గురించి తపన తగ్గిపోయాయి. ఎవరిస్వార్ధం వాళ్ళు చూసుకోవడం, మహాఅయితే వాళ్ళవాళ్ళ కుటుంబాల గురించి బాధపడటమే తప్ప సమాజం ఇంకా మానవజాతి గురించి పట్టించుకొనేవాళ్ళే కరువయ్యారు.

ఇకనైనా మనం మారాలి. లేకపోతే మానవులనే వాళ్ళు భూమిపై అంతరించిపోయే ప్రమాదం వుంది. ఈ కలహాలు, యుద్ధాలు మనకొద్దు. మనిషిని మనిషిగా ప్రేమిద్దాం. మనని మనం కాపాడుకొందాం.


* Source: Wikipedia



చిరు రాజకీయ ప్రవేశం

చిరంజీవి రాజకీయ ప్రవేశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. చిరు అభిమానులు, మేధావులు ఇంకా సినీ పెద్దలు దీనిని స్వాగతిస్తుంటే కొందరు రాజకీయశక్తులు, ప్రత్యర్థులు దీనిని వ్యతిరేకిస్తూ ఆయనను విమర్సిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి, మొన్నటి రాజశేఖర్ ఉదంతంలో మాత్రం చిరుకి చేదు అనుభవం ఎదురయింది. నాయకుడన్నాక తన అనుచరులు చేసే పనులన్నింటికి తానే బాధ్యత వహించాలికదా!

నిజానికి చిరంజీవి జీవితం అందరికీ స్ఫుర్తిదాయకం. అతిచిన్న స్థితినించి అత్యున్నత స్థితికి చేరుకున్నాఆయన గమ్యం సమున్నతమైన మానవసేవే! ఒక స్టేటస్ సంపాదించాక, కొన్ని ఆస్తులను కూడబెట్టుకున్నాక మిగతా ప్రపంచం గురించి మర్చిపోయే మనుషులనే మనం సాధారణంగా చూస్తుంటాం. కాని చిరు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, భారతదేశం ఇంకా ఖండాంతర భారతీయులవద్ద ప్రముఖుడయినా ఆయన సమాజం గురించి ఈరొజుకీ ఎంతో శ్రమిస్తారు.

చిరు రాజకీయ ప్రవేశం తప్పకుండా ముదావహం. అయితే ఆయన తన బాహ్య శత్రువులనేకాకుండా అంతర్గత శత్రువులని కూడా కనిపెట్టి వుండాలి. ఎందుకంటే ఆయన ఆశయాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకొనే కార్యకర్తలు నూటికి నూరుశాతం ఉండకపోవచ్చు. ఆయన ఎంతో గొప్ప ఆశయంతో మొదలుపెట్టిన ఈయజ్ఞానికి అప్పుడే కులం రంగు, ప్రాంతం రంగు, గ్రూపు రంగు పులిమే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆయన పట్టుదలతో, కృషితో ఈ శత్రువులను అధిగమించగలరు.

చిరు మన రాష్ట్రాన్ని రాబోయే సంవత్సరాల్లో దీటుగా తయారుచేయ్యటమేకాక తనలాంటి ఉత్తమఆశయాలున్న నాయకులు మరింతమందిని తయారు చేస్తారని ఆశిద్దాం!


అధికారపు దాహర్తికి వెలవెలబోయిన తెలుగు తేజం
"చిరు" రాకతో ఇకనైనా చూస్తుందేమో వేకువ ఉదయం!

శివ రామ ప్రసాద్

Saturday, May 3, 2008

వర్షం

నీ జ్ఞాపకాల వర్షం నను తదిపెను అనునిత్యం
నీ ఒరకంటి చూపే నను ముంచెత్తే మైకం
ఇక నీతోడే నాజీవితమన్నది తథ్యం
నీ కనుపాపల్లోనే వేచియుంది నా ఉదయం

 

నీ కళ్లు

కవ్వించే నీ కళ్లు, నా మనసుకి అవి వేసెను సంకెళ్ళు
నీ నుదుట వాలే ముంగుర్లు అవి తొలి వలపుకి పిలుపులు
నీ హంసల నడకలు, అవి ఇహంలో మోక్షానికి దారులు
ప్రకృతి సైతం అచ్చెరువొందే బ్రహ్మ సృష్టికి నా వందనాలు

Friday, April 25, 2008

ప్రేమంటే


ప్రేమంటే ఏమిటి?

ప్రేమంటే అవధుల్లేని ఆనందం
దానిలోఉంది తీయని మకరందం

ప్రేమించే మనసు ఒక విహంగం
ప్రేమించని మనిషి ఒక వేదాంతం

అది సఫలమైతే పగలేవెన్నెల చందం
అదే విఫలమైతే బ్రతుకంతా విషాదం

ఈ ప్రేమ మహిమలు అనంతం



ప్రేమని ప్రేమించు ప్రేమకై


నేనుసైతం


కోటలుదాటిన కోట్ల మాటలెందుకు?
చేతలుగా మారిన ఒక్కమాట చాలు

మైమరిపించే మురిపించే వరాలెందుకు
సాటి మనిషికిచ్చే గౌరవం చాలు

గుడిలో దేవునికి క్షీరాభిషేకాలెందుకు?
ఇతరుల బాధలకు కనుజారే ఒక్క కన్నీటిబొట్టు చాలు

స్వార్థచింతనతో చేరే ఆకాశ పుంతలెందుకు?
నిస్వార్థంగా సాధించే విశ్వమానవ కల్యాణమే మేలు!



నేను సైతం మానవాళి అభ్యున్నతికై సమిధనవుతాను


నీకోసం


నా కన్నులు ఎదురు చూసాయి నీ రాకకై
నా పాదాలు నడిచాయి నినుచేరు దారికై
నా హృదయం స్పందించింది నీ ప్రేమకై
ఎంతకాలమైనా వేచియుంటాను నీ బదులుకై


Monday, April 21, 2008

వెన్నెల


నీ నవ్వులు విరబుసిన ఈ వెన్నెల
ప్రతి రాత్రీ కవ్విస్తుందే నన్నే ఇలా
నా ఎదలోతున దాగున్న ఈ తీయని కల
ఏనాటికైనా నీతో తెలిపేదెలా?


 

పిలుపు


నువు దూరానవున్నా ఓ చిరునవ్వే నీ పిలుపు
ఏనాటికి చేరునో నీదరికి నా వలపు
ప్రతిక్షణం నీ ఊహలే రాదెన్నడు మరపు
నే సర్వం సాధించినా నీప్రేమే నా గెలుపు

నిరీక్షణ


ప్రభాతవేళ నేలను తాకిన తొలి సూర్యకిరణం
జగతిని మేలుకొలిపే ఉదయ సుప్రభాతం
నాలో అలజడి రేపిన నీప్రేమే తొలి సంధ్యారాగం
నిను చేరుటకే నా ఈ అలుపెరుగని ప్రయాణం


నీ నిరీక్షణలో అనుక్షణం ...


 

నీవులేని దేశం


నీతో ఎన్నో చెప్పాలని ఊహల్లో విహరించా
నీదరికే చేరాలని మనసంతా తపించా
నీ విరహాగ్ని వేడిలో ఎడారినై రగిలా
నీవులేని దేశంలో నిశీధినై మిగిలా


 

నీ తలపే

కొన్ని భావాలే మాటలవుతాయి
కొన్ని మాటలే కవితలవుతాయి
కొన్ని కవితలే పాటలవుతాయి


నువ్వుంటే జీవితమే తీయని పాట
నీతోడుంటే కష్టాలైనా పూలబాట
నీతలపులే నామదిలో ప్రతిపూట



నేస్తం

నీ పరిచయం నాకొక ఆద్బుతం!

నీతో స్నేహం నా జీవితానికో వరం

నీతో పరిణయం నాలోని అందమైన స్వప్నం

మరి నాకలలన్నీనిజంచేస్తావా నేస్తం?

మౌనంలా

కరిమబ్బుల దాగున్న వెన్నెల జాడ లేక

విరహంతో వేసారిన కోయిలలా

నీ మనసున దాగున్న ప్రేమ కానరాక

వేచియున్నానీ పిలుపు కొసం మౌనంలా! 

స్వాగతం

కలలే అలలై బ్లాగ్ కి స్వాగతం.

మీరంతా ఆశ్చర్యపోవచ్చు ... "కలలే అలలై" ఈ పేరేమిటి అని!

మన కలలకి ఆలోచనలకి దగ్గర సంబంధం వుంది. ఈ రెండింటికీ ఎల్లలు లేవు. వాటిలోంచే మన మనసులోని భావాలు రూపు దిద్దుకుంటాయి. అలాంటి భావాల రూపకల్పనే ఈ "కలలే అలలై".

 

Welcome Note

Welcome to KalaleyAlalai BLOG.
Appreciate your time for reading.
Welcome your comments.