ప్రేమంటే ఏమిటి?
ప్రేమంటే అవధుల్లేని ఆనందం
దానిలోఉంది తీయని మకరందం
ప్రేమించే మనసు ఒక విహంగం
ప్రేమించని మనిషి ఒక వేదాంతం
అది సఫలమైతే పగలేవెన్నెల చందం
అదే విఫలమైతే బ్రతుకంతా విషాదం
ఈ ప్రేమ మహిమలు అనంతం
ప్రేమని ప్రేమించు ప్రేమకై
This is a blog to share/publish my write-ups!
ప్రేమంటే ఏమిటి?
ప్రేమంటే అవధుల్లేని ఆనందం
దానిలోఉంది తీయని మకరందం
ప్రేమించే మనసు ఒక విహంగం
ప్రేమించని మనిషి ఒక వేదాంతం
అది సఫలమైతే పగలేవెన్నెల చందం
అదే విఫలమైతే బ్రతుకంతా విషాదం
ఈ ప్రేమ మహిమలు అనంతం
ప్రేమని ప్రేమించు ప్రేమకై
కోటలుదాటిన కోట్ల మాటలెందుకు?
చేతలుగా మారిన ఒక్కమాట చాలు
మైమరిపించే మురిపించే వరాలెందుకు
సాటి మనిషికిచ్చే గౌరవం చాలు
గుడిలో దేవునికి క్షీరాభిషేకాలెందుకు?
ఇతరుల బాధలకు కనుజారే ఒక్క కన్నీటిబొట్టు చాలు
స్వార్థచింతనతో చేరే ఆకాశ పుంతలెందుకు?
నిస్వార్థంగా సాధించే విశ్వమానవ కల్యాణమే మేలు!
నేను సైతం మానవాళి అభ్యున్నతికై సమిధనవుతాను
నా కన్నులు ఎదురు చూసాయి నీ రాకకై
నా పాదాలు నడిచాయి నినుచేరు దారికై
నా హృదయం స్పందించింది నీ ప్రేమకై
ఎంతకాలమైనా వేచియుంటాను నీ బదులుకై
నీ నవ్వులు విరబుసిన ఈ వెన్నెల
ప్రతి రాత్రీ కవ్విస్తుందే నన్నే ఇలా
నా ఎదలోతున దాగున్న ఈ తీయని కల
ఏనాటికైనా నీతో తెలిపేదెలా?
ప్రభాతవేళ నేలను తాకిన తొలి సూర్యకిరణం
జగతిని మేలుకొలిపే ఉదయ సుప్రభాతం
నాలో అలజడి రేపిన నీప్రేమే తొలి సంధ్యారాగం
నిను చేరుటకే నా ఈ అలుపెరుగని ప్రయాణం
నీ నిరీక్షణలో అనుక్షణం ...
నీతో ఎన్నో చెప్పాలని ఊహల్లో విహరించా
నీదరికే చేరాలని మనసంతా తపించా
నీ విరహాగ్ని వేడిలో ఎడారినై రగిలా
నీవులేని దేశంలో నిశీధినై మిగిలా
కొన్ని భావాలే మాటలవుతాయి
కొన్ని మాటలే కవితలవుతాయి
కొన్ని కవితలే పాటలవుతాయి
నువ్వుంటే జీవితమే తీయని పాట
నీతోడుంటే కష్టాలైనా పూలబాట
నీతలపులే నామదిలో ప్రతిపూట
నీ పరిచయం నాకొక ఆద్బుతం!
నీతో స్నేహం నా జీవితానికో వరం
నీతో పరిణయం నాలోని అందమైన స్వప్నం
మరి నాకలలన్నీనిజంచేస్తావా నేస్తం?
కరిమబ్బుల దాగున్న వెన్నెల జాడ లేక
విరహంతో వేసారిన కోయిలలా
నీ మనసున దాగున్న ప్రేమ కానరాక
వేచియున్నానీ పిలుపు కొసం మౌనంలా!
మీరంతా ఆశ్చర్యపోవచ్చు ... "కలలే అలలై" ఈ పేరేమిటి అని!
మన కలలకి ఆలోచనలకి దగ్గర సంబంధం వుంది. ఈ రెండింటికీ ఎల్లలు లేవు. వాటిలోంచే మన మనసులోని భావాలు రూపు దిద్దుకుంటాయి. అలాంటి భావాల రూపకల్పనే ఈ "కలలే అలలై".