Monday, August 16, 2021

Mother / అమ్మా

 నీ గర్భమందు, నా పాదమర్ధనాన సోలిపోయిననూ,

తిరిగి నే వెన్నబాల నవ్వ మురిసి, పోటు మరచిన మాతృమూర్తీ,


ముసలివైయున్నా, అట్టి మూగప్రేమ

అవధాన వేళ, జీవన వికాసమ్మై విరాజిల్ల,


ఏమిచ్చి నే రుణవిముక్తుండ,

మదీ చరమాంక సేవజేయ ధన్యుడ దేదీప్యమా?


Meaning: Telugu


నేను నీ కడుపులో కాలితో తన్నిన నొప్పిని ఓర్చుకొని,

నా ఒక చిరునవ్వుతో అన్నీ మరచిన ఓ అమ్మా,


నీవు ముసలి దానివైనా,

వ్యక్తం చేయని నీ ప్రేమ,

జీవితంలో అందలాలు ఎక్కించగా,


ఏమిచ్చినీ రుణం తీర్చుకోగలను,

నీ సేవ చేయడం తప్ప?


Meaning: English


Oh mother,

You beared the ache of my foot twists while I was in your stomach,

And just like that forgot that pain as soon as you see my little first smile!


When you get old, but your untold love still keeps me on top of this world,


How can I show my gratitude other than serving you at your difficult times?

No comments: