గమనిక: ఈ వ్యాసం ఏ ఛానెల్ ను ప్రత్యేకంగా ఉద్దేశించి రాయబడలేదు.
ఇటీవల కాలంలో వస్తున్న TV కార్యక్రమాలని చూసి నాకనిపించినవి, మనందరం ఆలోచించాలనిపించినవి మీకు చెప్పాలనిపించింది.
1. సృజనాం నాస్తి, వర్తమానం నాస్తి, గతం అమృతః - వీళ్ళు సృజనాత్మకత కోల్పోయి వర్తమానంలో జరిగేవి పట్టించుకోకుండా, ఎప్పుడో జరిగిన విషయాల్లోనో, ఎవరో చేసే పనుల్లోనో వేలుపెట్టి ఇంటర్వ్యూలు, చర్చలు చేస్తున్నారు. ఇక్కడ మచ్చుకకి కొన్ని ఉదాహరణలు:
- బత్తి సురేష్ ఉదయ్ పల్లాన్ ని ఎందుకు విమర్శిస్తున్నాడు?
- ఏ రాజకీయ నాయకుడు ఎవ్వరిని ఎలా, ఎప్పుడు, ఏమని తిట్టారు?
- ఆలయాల్లో ఆడవారిని ఎందుకు అనుమతించరు?
- జాతకాలని నమ్మాలా వద్దా?
- గ్రహణంలో తినడం మంచిదా, చెడ్డదా, ఏమీకాదా?
- నీలి చిత్రాల ప్రభావం పిల్లపై ఉంటుందా?
- ఫలానా నటి G*T-2 లో అవకాశం వస్తే నటిస్తుందా?
2. వాదనాం భవతి బుద్ధినాశః, సమస్యామ్ అపరిష్కృతే - ప్రపంచంలో జరిగే ప్రతివిషయానికి, ప్రతిమనిషికీ ఎంతోకొంత స్పందన ఉంటుంది. కానీ వీళ్ళు ఆ మనుషుల్ని స్టూడియోల్లోకి పిలిచి, దాన్ని బహిర్గతం చేయించి, అక్కడితో ఊరుకోకుండా ఆ భావాల్ని వ్యతిరేకించేవాళ్ళని కూడా పిలిచి వాళ్ళ ప్రతిస్పందన, తిట్లు, శాపనార్ధాలు చూపిస్తున్నారు, వినిపిస్తున్నారు. చర్చల్లో మాట్లాడేవాళ్ళని ప్రేరేపించి మనుషులమధ్య గొడవలు పెట్టి దాన్ని చూస్తూ, వింటూ పాశవికంగా ఆనందిస్తున్నారు. TRP రేటింగుల కోసం ప్రాకులాడుతున్నారు. అసలు సమస్యలు వాటి పరిష్కారాలు మాత్రం కనుగొనట్లేదు.
చాలా చర్చలు ఎవరో బూతు పురాణం ఎత్తుకొనో, కోపంవచ్చి షోనించి లేచి వెళ్ళిపోయో, సమయాభావం వల్లనో, లేక సగంమందికి మాట్లాడే అవకాశం రాకో అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. అసలు చర్చ ఏ సమస్య పరిష్కారం కోసం పెట్టారో వాళ్ళకే తెలియనట్లు ముగించేస్తున్నారు.
3. Conflicting Objectives (బహుశా భిన్నమైన దృక్పధాలు) - ఒక షోలో లేక చర్చలో ఏదైతే చెప్తూ వుంటారో దానికి వ్యతిరేకమైన విషయాలు చూపించి ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. ఉదాహరణకి G*T అను సిరీస్ వల్ల సమాజానికి చెడా అనేవిషయంపై చర్చ చూపిస్తూనే ఆపక్కన అవే సినిమా బూతుబొమ్మలు చూపిస్తున్నారు. మొత్తానికి జనాలు పిచ్చిపుల్లయ్యలు అనుకుంటూ వాళ్ళకి నచ్చినవి వాళ్ళు చూపిస్తున్నారు.
4. Wrong/Forced Representation of Telugu and Indian Society (తెలుగువారినందరికి వీళ్ళే వకాల్తా పుచ్చుకొన్నట్టు, భారతీయ సాంప్రదాయాన్ని వీళ్ళే కాపాడుతున్నట్టు Build-Up): మొన్న ఒక ఛానెళ్లలో ఒక కులం వాళ్ళు పాట గురించిన చర్చలో వ్యాఖ్యాత ఆపాట రాసినవాడిని వదిలేసి దానికి సంగీతం సమకూర్చినవాడిని పట్టుకుని లైవ్లో తిట్లు. R*V ఇంటర్వ్యూలో మన సంప్రదాయాల్ని వీళ్లే కాపాడుతున్నట్టు మాట్లాడటం, ప్రతీ దానికి ఫలానా సంఘాలు, ఎవరో అమ్మాయిలు వాళ్ళ డబ్బులతో పబ్బులకెళ్తే సమాజం పాడైపోతుంది అని చెప్పడం, ఎక్కడో భార్యాభర్తల గొడవుంటే కుటుంబవిలువలు లేవని చించుకోవడం, ఇలా వీళ్ళ చాందసవాద, లేదా వ్యక్తిగత అభిప్రాయాలని మన సమాజం అంతా ఇలాగే ఆలోచిస్తోంది అన్నట్టు చెప్తున్నారు.
అన్ని చానెల్స్ తెల్లారి లేస్తే కులం , మతం ఇంకా వర్గ వ్యవస్థలకి వ్యతిరేకం అని చెప్పుతూనే రోజు మొత్తంలో సగానికి పైగా కులాల సమీకరణాలు, కొత్తగా కులాలకు రేజర్వేషన్లు, కులాల, మతాల మనోభావాలు, వర్గపోరులు మాత్రమే చూపిస్తుంటే "దెయ్యాలు వేదాలు వల్లించిన చందం" లా వుంది.
ఈ చానెల్స్ ఇకనైనా ప్రజల్ని మభ్యపెట్టడం మానుకోవాలి. లేకపోతే మీకు ప్రజలే బుద్ది చెప్పే రోజొస్తుంది.
- మీ శివరాం

5 comments:
చాలా బాగా రాసారు
Absolutely true. it is baised and paid media and no this of journalism
Most sensible people dont see TV now a days imo. Watching any news channel (hindi, English or telugu) is waste of time, and gives headache. I miss Doordarshan
nice write up
Post a Comment