Thursday, May 15, 2008

చిరు రాజకీయ ప్రవేశం

చిరంజీవి రాజకీయ ప్రవేశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. చిరు అభిమానులు, మేధావులు ఇంకా సినీ పెద్దలు దీనిని స్వాగతిస్తుంటే కొందరు రాజకీయశక్తులు, ప్రత్యర్థులు దీనిని వ్యతిరేకిస్తూ ఆయనను విమర్సిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి, మొన్నటి రాజశేఖర్ ఉదంతంలో మాత్రం చిరుకి చేదు అనుభవం ఎదురయింది. నాయకుడన్నాక తన అనుచరులు చేసే పనులన్నింటికి తానే బాధ్యత వహించాలికదా!

నిజానికి చిరంజీవి జీవితం అందరికీ స్ఫుర్తిదాయకం. అతిచిన్న స్థితినించి అత్యున్నత స్థితికి చేరుకున్నాఆయన గమ్యం సమున్నతమైన మానవసేవే! ఒక స్టేటస్ సంపాదించాక, కొన్ని ఆస్తులను కూడబెట్టుకున్నాక మిగతా ప్రపంచం గురించి మర్చిపోయే మనుషులనే మనం సాధారణంగా చూస్తుంటాం. కాని చిరు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, భారతదేశం ఇంకా ఖండాంతర భారతీయులవద్ద ప్రముఖుడయినా ఆయన సమాజం గురించి ఈరొజుకీ ఎంతో శ్రమిస్తారు.

చిరు రాజకీయ ప్రవేశం తప్పకుండా ముదావహం. అయితే ఆయన తన బాహ్య శత్రువులనేకాకుండా అంతర్గత శత్రువులని కూడా కనిపెట్టి వుండాలి. ఎందుకంటే ఆయన ఆశయాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకొనే కార్యకర్తలు నూటికి నూరుశాతం ఉండకపోవచ్చు. ఆయన ఎంతో గొప్ప ఆశయంతో మొదలుపెట్టిన ఈయజ్ఞానికి అప్పుడే కులం రంగు, ప్రాంతం రంగు, గ్రూపు రంగు పులిమే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆయన పట్టుదలతో, కృషితో ఈ శత్రువులను అధిగమించగలరు.

చిరు మన రాష్ట్రాన్ని రాబోయే సంవత్సరాల్లో దీటుగా తయారుచేయ్యటమేకాక తనలాంటి ఉత్తమఆశయాలున్న నాయకులు మరింతమందిని తయారు చేస్తారని ఆశిద్దాం!


అధికారపు దాహర్తికి వెలవెలబోయిన తెలుగు తేజం
"చిరు" రాకతో ఇకనైనా చూస్తుందేమో వేకువ ఉదయం!

శివ రామ ప్రసాద్

1 comment:

Unknown said...

there is no doubt that chiru is a philanthrophist and a has struggled hard to reach to the current position. I doubt if he could be an efficient politician. I admire him for his qualities but would be scepticle about doing a good job to serve the state just because he is a good person. My doubts are about his capabilities rather than commitment. LOKSATTA sounds a better party with a lot of ground work and experience in community care, participation and administration. I believe in Jayaprakash narayana and other senior leaders of loksatta.